‘అఖండ 2’లో మరో ఇంట్రెస్టింగ్ పాత్ర

‘అఖండ 2’లో మరో ఇంట్రెస్టింగ్ పాత్ర

Published on Mar 4, 2024 7:00 AM IST

బాలయ్య – బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన ‘అఖండ’ అద్భుత విజయాన్ని సాధించింది. దీంతో ‘అఖండ 2’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఐతే, ఈ సీక్వెల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ?, ఎప్పుడు రిలీజ్ అవుతుంది ? లాంటి విషయాల పై బాలయ్య ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా బోయపాటి శ్రీను ఇప్పటికే ‘అఖండ 2’ స్క్రిప్ట్ పూర్తి చేశాడు. బాలయ్య అఘోరగా కనిపించబోతున్నాడు. ఐతే, తాజాగా ఈ సినిమాలోని సెకండ్ హాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ పై ఓ క్రేజీ అప్ డేట్ వినిపిస్తోంది. ఈ ఫ్లాష్ బ్యాక్ లో బాలయ్య పూర్తిగా ఓల్డ్ గెటప్ లో కనిపిస్తాడని.. పైగా బాలయ్య సాధువు లుక్ లో కనిపిస్తాడని టాక్ నడుస్తోంది.

మరి, అఘోర పాత్రతో పాటు సాధువు పాత్రలో కూడా బాలయ్య నటిస్తున్నాడు అన్నమాట. ఈ వార్తలో నిజం ఎంత ఉందో తెలియదు గానీ, ఈ న్యూస్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇక ఈ కథలో సోషియో ఫాంట‌సీ ఎలిమెంట్స్ ఉంటాయని.. మెయిన్ కథాంశమే చాలా కొత్తగా ఉంటుందని.. బాలయ్య నుంచి మరో వినూత్న సినిమా రాబోతుందని చెబుతున్నారు. అలాగే, బోయపాటి మార్క్ యాక్షన్ సీన్స్ అండ్ పొలిటికల్ పంచ్ లు మాత్రం సినిమాలో ఫుల్ గా ఉంటాయని తెలుస్తోంది. ప్రస్తుతం బాలయ్య.. డైరెక్టర్ బాబీ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు