‘అఖండ 2’ పై లేటెస్ట్ అప్ డేట్

‘అఖండ 2’ పై లేటెస్ట్ అప్ డేట్

Published on Apr 22, 2024 8:06 AM IST

బాలయ్య – బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన అఖండ అద్భుత విజయాన్ని సాధించింది. దీంతో ‘అఖండ 2’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఐతే, ఈ సీక్వెల్ ను ఎన్నికల తర్వాత స్టార్ట్ చేస్తాం అని బోయపాటి ఇప్పటికే క్లారిటీ ఇచ్చాడు. స్క్రిప్ట్ కూడా ఇప్పటికే పూర్తి అయ్యింది. కథ ప్రకారం.. సినిమా పూర్తిగా శైవత్వం పై సాగుతుందని.. హిందుత్వానికి ప్రతిరూపం దక్షిణ భారత దేశం అనే కోణంలో సీన్స్ ఉంటాయని తెలుస్తోంది. అలాగే..హిందూ దేవాలయాలకు సంబదించిన లింక్స్ తో పాటు దక్షిణ భారత దేశం గొప్పతనాన్ని కూడా ఈ సినిమాలో బాగా ఎలివేట్ చేస్తున్నారని తెలుస్తోంది.

మొత్తానికి ఈ సినిమా కోసం బాలయ్య ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ ఏడాది అక్టోబర్ నుంచి ఈ సినిమా స్టార్ట్ కాబోతుంది అని తెలుస్తోంది. బోయపాటి శ్రీను ఇప్పటికే ‘అఖండ 2’ స్క్రిప్ట్ పూర్తి చేశాడు. ప్రస్తుతం డైలాగ్ వెర్షన్ పై కసరత్తులు చేస్తున్నారు. కాగా ‘అఖండ 2’ లో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కూడా ఓ కీలక పాత్రలో నటించబోతునట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాలయ్య.. డైరెక్టర్ బాబీతో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు