విశ్వంభర కోసం భారీ యాక్షన్ సెట్

విశ్వంభర కోసం భారీ యాక్షన్ సెట్

Published on May 19, 2024 7:32 PM IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా యంగ్ దర్శకుడు వశిష్ట ‘విశ్వంభర’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిష నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాలోని ఓ కీలక యాక్షన్ సీక్వెన్స్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్స్ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సీక్వెన్స్ మెగాస్టార్ – త్రిష పాత్రలతోనే స్టార్ట్ అవుతుందని టాక్. జూన్ రెండో వారం నుంచి ఈ యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేయనున్నారని టాక్.

కాగా ఈ సినిమాలో మెగాస్టార్ ను ఫ్యాన్స్ ఎలా చూడాలి అనుకుంటున్నారో.. ఆయన పాత్ర అలాగే ఉంటుందట. అలాగే, ఈ చిత్రంలో అద్భుతమైన ఫాంటసీ డ్రామా కూడా ఉంటుందట. UV క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ విశ్వంభర సినిమాకు కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం జనవరి 10, 2025న విడుదల కాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు