ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్

Published on May 15, 2024 7:12 PM IST

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ‘యంగ్ టైగర్ ఎన్టీఆర్’ హీరోగా రాబోతున్న పాన్ ఇండియా సినిమా ‘దేవర’. ఐతే, ఎన్టీఆర్ బర్త్ డే రోజున దేవర టైటిల్ సాంగ్ లిరికల్ వీడియోను రిలీజ్ చేస్తున్నారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. కాగా దేవర టీమ్ తారక్ అభిమానులందరికీ ఈ వార్తల పై ఒక సాలిడ్ న్యూస్ ను రివీల్ చేసింది. దేవర మొదటి సింగిల్, “ఫియర్ (భయం) సాంగ్” మే 19 న విడుదల కానుంది. ఈ మేరకు ఓ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు.

పోస్టర్ లో ఎన్టీఆర్ చేయి మరియు రక్తంతో తడిసిన గొడ్డలిని హైలైట్ చేస్తూ పోస్టర్‌ను డిజైన్ చేశారు. పైగా పెను తుఫాను కోసం అంతా సెట్ చేయబడింది అంటూ మెసేజ్ కూడా పెట్టారు. ఎన్టీఆర్ పుట్టినరోజు మే 20 న, కానీ అనిరుధ్ కంపోజ్ చేసిన ఈ మాస్ నంబర్‌ తో ఎన్టీఆర్ అభిమానులకు వేడుకలు కొంచెం ముందుగానే స్టార్ట్ కానున్నాయి. మొత్తానికి ఈ సినిమా కోసం కొరటాల కూడా బాగా కసరత్తులు చేశాడు. ఇప్పటికే, ఎన్టీఆర్ – కొరటాల కాంబినేషన్ లో గతంలో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ పెద్ద హిట్ కావడంతో ఈ సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. దేవర మూవీ అక్టోబర్ 10న రిలీజ్ కాబోతుంది.

Gear up NTR fans; Devara’s first single coming out on this date

సంబంధిత సమాచారం

తాజా వార్తలు