ధనుష్ “సార్” ఫస్ట్ సింగిల్ పై లేటెస్ట్ అప్డేట్ వచ్చేసింది.!

తమిళ స్టార్ హీరో గ్లోబల్ స్టార్ ధనుష్ హీరోగా భీమ్లా నాయక్ ఫేమ్ నటి సంయుక్త మీనన్ హీరోయిన్ గా మన టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ బై లాంగువల్ చిత్రం “సార్”. తమిళ్ లో వాతి పేరిట తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై అయితే మంచి అంచనాలు నెలకొనగా రీసెంట్ గా ఈ చిత్ర యూనిట్ అవైటెడ్ ఫస్ట్ సింగిల్ పై అప్డేట్ కూడా ఇచ్చారు. ఇక ఈ చిత్రం నుంచి ఈ సాంగ్ కోసం ఫ్యాన్స్ కూడా మంచి ఆసక్తి గా ఎదురు చూస్తుండగా..

ఇప్పుడు సంగీత దర్శకుడు జి వి ప్రకాష్ అయితే ఇంట్రెస్టింగ్ అప్డేట్ మరొకటి అందించాడు. మరి ఈరోజు సాయంత్రం అయితే అందరూ ఎదురు చూస్తున్న ఈ అప్డేట్ రాబోతున్నట్టుగా కన్ఫర్మ్ చేసాడు. మతి బహుశా మేకర్స్ అయితే ఈ సాంగ్ రిలీజ్ డేట్ ని ఏమన్నా అనౌన్స్ చేస్తారేమో అనేది చూడాలి. ఇక ఈ చిత్రం ఓ పీరియాడిక్ ఫ్లిక్ గా తెరకెక్కుతుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మాణం వహిస్తున్నారు అలాగే డిసెంబరు లో ఈ చిత్రం రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు.

Exit mobile version