‘విజయకాంత్’ లేటెస్ట్ హెల్త్ అప్ డేట్

‘విజయకాంత్’ లేటెస్ట్ హెల్త్ అప్ డేట్

Published on Dec 11, 2023 1:00 PM IST

ప్రముఖ తమిళ నటుడు, డీఎండీకే వ్యవస్థాపకుడు, కెప్టెన్‌ విజయకాంత్ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఐతే, విజయకాంత్ అనారోగ్యం నుంచి కోలుకున్నారు. ఈ రోజు ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి చేరుకున్నారు. తమిళ మీడియా వర్గాల కథనాల ప్రకారం..శ్వాస కోస సంబంధిత సమస్యతో బాధపడుతున్న విజయకాంత్ ప్రస్తుతానికి కోలుకుని ఇంటికి చేరుకున్నారు.

కాగా అదృష్టవశాత్తూ ఆయన తిరిగి కోలుకున్నారని ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఆనందం వ్యక్తం చేస్తూ పోస్ట్ లు పెడుతున్నారు. గత నెల 18న విజయకాంత్ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. డీఎండీకే అధినేతగా విజయ్ కాంత్ కి మంచి పేరు ఉంది. తమిళ సినీ పరిశ్రమలోనే కాకుండా, అటు తమిళ రాజకీయాల్లోనూ విజయకాంత్ తనదైన పాత్రను పోషించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు