అత్యంత విషమంగా విజయ్‌ కాంత్ ఆరోగ్యం

అత్యంత విషమంగా విజయ్‌ కాంత్ ఆరోగ్యం

Published on Dec 3, 2023 6:20 PM IST

ప్రముఖ తమిళ నటుడు, డీఎండీకే వ్యవస్థాపకుడు, కెప్టెన్‌ విజయ్‌ కాంత్ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని టాక్ నడుస్తోంది. దీంతో, విజయకాంత్ చికిత్స పొందుతున్న చెన్నైలోని మియాట్ ఆసుపత్రికి ఎండీకే నేతలు, కార్యకర్తలు చేరుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆస్పత్రి దగ్గర భారీగా పోలీసుల మోహరించారట. కాగా, విజయ్ కాంత్ కి గత కొన్ని రోజులుగా ఆరోగ్యం క్షీణించడంతో, ఆయన గత కొద్ది రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కలగడంతో ఎప్పటికప్పుడు విజయ్ కాంత్ కి కృత్రిమ శ్వాస అందిస్తున్నారు వైద్యులు. అయితే, రోజురోజుకు ఆయన ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా మెరుగు పడకపోవడంతో ఆయన అభిమానులు ఆందోళనగా ఉన్నారు. మరోపక్క విజయ్ కాంత్ త్వరగా కోలుకోవాలని అభిమానులు, తమిళ సినీ ప్రముఖులు కోరుకుంటున్నారు. డీఎండీకే అధినేతగా విజయ్ కాంత్ కి మంచి పేరు ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు