మరో తెలుగు సినిమాలో బాబీ డియోల్ ?

మరో తెలుగు సినిమాలో బాబీ డియోల్ ?

Published on Feb 19, 2024 9:35 PM IST

ఎనర్జిటిక్ యాక్టర్ రామ్ పోతినేని – డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కలయికలో ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ డబుల్ ఇస్మార్ట్ పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఐతే, ఈ సినిమాలో మరో కీలక పాత్ర ఉంటుందని.. ఈ పాత్రలో మరో బాలీవుడ్ హీరోని తీసుకున్నారని తెలుస్తోంది. యానిమల్ సినిమాతో విలన్ గా ఫామ్ లోకి వచ్చిన బాబీ డియోల్ ను డబుల్ ఇస్మార్ట్ కోసం తీసుకున్నారట. ఇప్పటికే, ఈ మూవీలో సంజయ్ దత్ కీలక పాత్ర చేస్తున్నాడు.

ఇప్పుడు బాబీ డియోల్ కూడా డబుల్ ఇస్మార్ట్ లో పార్ట్ కానున్నాడు. పూరి జగన్నాధ్ మరియు ఛార్మి కౌర్ కలిసి పూరీ కనెక్ట్స్‌పై, విషు రెడ్డి సీఈవోగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్ రామ్ కెరీర్‌ లోనే అత్యధిక వసూళ్లు రాబట్టింది. మరి, డబుల్ ఇస్మార్ట్ ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో చూడాలి. కాగా ఈ సినిమా మహా శివరాత్రి సందర్భంగా మార్చి 8, 2024న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు