‘చరణ్’ పై మాంటేజ్ సాంగ్ ?

‘చరణ్’ పై మాంటేజ్ సాంగ్ ?

Published on Apr 22, 2024 7:00 AM IST

స్టార్ డైరెక్టర్ శంకర్ – మెగాపవర్ స్టార్ ‘రామ్ చరణ్ తేజ్’ కాంబినేషన్ లో రాబోతున్న పాన్ ఇండియా సినిమా గేమ్ చేంజర్. ఐతే, ఈ సినిమా వచ్చే షెడ్యూల్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనుంది. ఈ సీన్స్ లో రామ్ చరణ్ తో పాటు ఇతర తారాగణం కూడా నటించనున్నారు. అనంతరం చరణ్ పై ఓ మాంటేజ్ సాంగ్ ను షూట్ చేస్తారట. ఈ మాంటేజ్ సాంగ్ లో చరణ్ రెండో పాత్ర తాలుకూ గ్రాఫ్ ను చూపిస్తారని.. కథ ప్రకారం ఈ మాంటేజ్ సాంగ్ చాలా కీలకం అని, ఈ పాట ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే చరణ్ సీనియర్ పాత్ర పై ఉంటుందని తెలుస్తోంది.

కాగా ఈ సినిమా పై మెగా ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమాలో అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్ ను పెడుతున్నాడు శంకర్. ఈ చిత్రంలో అంజలి, శ్రీకాంత్, ఎస్‌జె సూర్య, నవీన్ చంద్ర వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ తన కెరీర్ లోనే బెస్ట్ లుక్‌లో కనిపించబోతున్నాడు. మొత్తానికి భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ భారీ సినిమాలో బరువైన ఎమోషన్స్ తో పాటు గ్రాండ్ విజువల్స్ కూడా ఉండబోతున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు