“గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి 2” పై లేటెస్ట్ అప్డేట్.!

“గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి 2” పై లేటెస్ట్ అప్డేట్.!

Published on May 30, 2024 3:56 PM IST

టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నేహా శెట్టి అలాగే అంజలి లు ఫీమేల్ లీడ్ లో దర్శకుడు కృష్ణ చైతన్య తెరకెక్కించిన లేటెస్ట్ ఇంటెన్స్ యాక్షన్ డ్రామా చిత్రం “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి”. మరి రీసెంట్ టైం లో అయితే ఈ సినిమాకే సాలిడ్ బజ్ నెలకొనగా ఈ సినిమాకి మంచి ప్రమోషన్స్ ని కూడా మేకర్స్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రం ప్రమోషన్స్ లో విశ్వక్ అలాగే నిర్మాత నాగవంశీ ఇద్దరూ మరిన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ అందించారు.

అలా విశ్వక్ ఈ సినిమాకి పార్ట్ 2 కోసం ఓపెన్ అయ్యాడు. ఈ సినిమాకి పార్ట్ 2 ఉందని అందులో కూడా తానే హీరో అంటూ చమత్కరించాడు. దీనితో అయితే ఈ చిత్రానికి సీక్వెల్ కూడా ఇప్పుడు ఉందని కన్ఫర్మ్ అయ్యిపోయిందని చెప్పాలి. ఇక ఈ సినిమాలో ఆయేషా ఖాన్ స్పెషల్ సాంగ్ ని చేయగా యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు నిర్మాణం వహించారు. మరి రేపు ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు