గోపీచంద్ తో ఊర్వశి స్పెషల్ సాంగ్ ?

గోపీచంద్ తో ఊర్వశి స్పెషల్ సాంగ్ ?

Published on Dec 12, 2023 3:04 AM IST

యాక్షన్ హీరో గోపీచంద్ హీరోగా దర్శకుడు శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ మూవీ చేసేందుకు సిద్ధం అయిన సంగతి తెలిసిందే. ఐతే, ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. తాజాగా బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటెలాతో ఆ స్పెషల్ సాంగ్ ని చేయిస్తున్నారని టాక్ నడుస్తోంది. ఐతే, మేకర్స్ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మొత్తానికి గోపీచంద్ – శ్రీను వైట్ల నుంచి పవర్ ఫుల్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామా రాబోతుందని తెలుస్తోంది. అలాగే, శ్రీను వైట్ల మార్క్ కామెడీ ఎలిమెంట్స్ కూడా సినిమాలో ఫుల్ గా ఉంటాయట.

కాగా ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉందట. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటెలాతో ఈ ఐటమ్ సాంగ్ ని చేయిస్తే బాగుంటుందని మేకర్స్ ఫీల్ అవుతున్నారు. ఈ మూవీని చిత్రాలయం స్టూడియోస్ సంస్థ పై ప్రొడక్షన్ నెంబర్ వన్ గా వేణు దోనేపూడి ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇంకా ఇతర నటీనటులు సాంకేతిక నిపుణుల వివరాలను ప్రకటించాల్సి ఉంది. అన్నట్టు ఈ మూవీకి విశ్వం అనే టైటిల్ ని యూనిట్ పరిశీలసిస్తోందట. స్క్రిప్ట్ కి తగ్గట్లుగా ఈ టైటిల్ సరిపోతుందని అంటున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు