“హను మాన్” గూస్ బంప్స్ ట్రీట్ పై లేటెస్ట్ అప్డేట్

“హను మాన్” గూస్ బంప్స్ ట్రీట్ పై లేటెస్ట్ అప్డేట్

Published on Feb 18, 2024 12:54 PM IST

Prashanth Varma

టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన లేటెస్ట్ పాన్ ఇండియా సెన్సేషనల్ హిట్ చిత్రం “హను మాన్” కోసం తెలిసిందే. యంగ్ హీరో తేజ సజ్జతో మన టాలీవుడ్ నుంచి మొదటి సూపర్ హీరో సినిమాగా ప్లాన్ చేసిన ఈ చిత్రం వారి కెరీర్ లో ఒక బిగ్ బ్రేక్ మూవీగా నిలిచింది.

అయితే ఈ చిత్రంలో ఆడియెన్స్ ని థియేటర్స్ వైపుగా రాబట్టేలా చేసిన ఎన్నో అంశాల్లో క్లైమాక్స్ సీక్వెన్స్ కూడా ఒకటి. మరి ఈ సీక్వెన్స్ లో సంగీత దర్శకుడు గౌర హరీష్ ఇచ్చిన మ్యూజిక్ మొత్తం కూడా ఆడియెన్స్ కి ఒక గూస్ బంప్స్ స్టఫ్ గా నిలిచి బిగ్ స్క్రీన్స్ పై ఒక ఊహించని అనుభూతిని అందించింది.

దీనితో ఈ సౌండ్ ట్రాక్ కోసం అప్పుడు నుంచి కూడా చాలా మంది ఎదురు చూస్తూ వస్తున్నారు. మరి ఫైనల్ గా దీనిపై ఇప్పుడు దర్శకుడు సాలిడ్ అప్డేట్ అందించాడు. ఎంతో పెద్ద హిట్ అయ్యిన ఈ “రఘునందన” ట్రాక్ ని అతి త్వరలోనే రిలీజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేసాడు. మరి బహుశా ఈ మంగళవారం నాడు ఈ సాంగ్ ని రిలీజ్ చేస్తారేమో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు