ఈ సారి రీమేక్ ప్లాన్ ఎలాంటి రిజల్ట్ ఇస్తోందో ?

ఈ సారి రీమేక్ ప్లాన్ ఎలాంటి రిజల్ట్ ఇస్తోందో ?

Published on Jun 15, 2020 8:57 PM IST


షాహిద్ కపూర్ ‘అర్జున్ రెడ్డి’ని హిందీలోకి ‘కబీర్ సింగ్’ పేరుతో రీమేక్ చేసి భారీ హిట్ అందుకొన్నారు. అదే రీమేక్ ఫార్ములాను ఫాలో అవుతూ చేస్తున్న ‘జెర్సీ’ సినిమా మీద కూడా హిందీ ప్రేక్షకుల్లో కూడా అమితాశక్తి నెలకొని ఉంది. మరి అర్జున్ రెడ్డిలా జెర్సీ వర్కౌట్ అవుతుందా.. అర్జున్ రెడ్డి బోల్డ్ మూవీ, యూత్ కి నచ్చే అంశాలు ఎక్కువుగా ఉన్న మూవీ. మరి జెర్సీ దానికి అపోజిట్. ఈ లెక్కన అర్జున్ రెడ్డికి ఉన్న అప్రోచ్ జెర్సీకి ఉండకపోవచ్చు ఈ సారి షాహిద్ కి ఈ రీమేక్ ప్లాన్ ఎలాంటి రిజల్ట్ ఇస్తోందో చూడాలి. కాగా షాహిద్ కి హీరోయిన్ గా మృణాల్‌ ఠాకూర్‌ కనిపించనుంది. తెలుగులో దర్శకత్వం వహించిన గౌతమ్ తిన్ననూరి హిందీ వర్షన్ ను కూడా డైరెక్ట్ చేయనున్నారు.

ఈ సినిమా తరువాత షెడ్యూల్ చండీగఢ్ లో మొదలుకానుంది. చండీగఢ్ లోని లొకేషన్స్ సినిమాలోని సీన్స్ కి బాగా సూట్ అవుతాయని.. ముఖ్యంగా లవ్ స్టోరీకి సంబంధించిన సీన్స్ అన్ని అక్కడే షూట్ చేస్తున్నారు. ఇప్పటికే అక్కడ షూట్ చేయడానికి పర్మిషన్స్ కూడా తీసుకున్నారని బాలీవడ్ మీడియా చెబుతుంది. ఈ చిత్రాన్ని బాలీవుడ్ నిర్మాత ఆమన్ గిల్ నిర్మాణంలో తెరకెక్కుతుంది.

తాజా వార్తలు