స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ‘యంగ్ టైగర్ ఎన్టీఆర్’ హీరోగా రాబోతున్న పాన్ ఇండియా సినిమా ‘దేవర పార్ట్ 1’. ఇప్పటికే ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ భారీ ధర చెల్లించి సొంతం చేసుకుందని.. అలాగే ఆడియో రైట్స్ ని టి-సిరీస్, శాటిలైట్ రైట్స్ ను ‘స్టార్ మా’ సొంతం చేసుకుందని తెలుస్తోంది. థియేట్రికల్ బిజినెస్ పరంగా చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో 110 కోట్ల వాల్యూ రైట్స్ సోల్డ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.
కాగా ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. మొత్తానికి దేవర సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. అనిరుధ్ రవిచందర్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో షైన్ టామ్ చాకో, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎన్టీఆర్ దేవర సినిమా కాకుండా ప్రస్తుతం హృతిక్ రోషన్ తో కలిసి మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా మల్టీస్టారర్ ‘వార్ 2’లో కూడా నటిస్తున్నాడు.