జాన్వీ కపూర్ తో రొమాంటిక్ సాంగ్ ?

జాన్వీ కపూర్ తో రొమాంటిక్ సాంగ్ ?

Published on Jul 7, 2024 6:37 PM IST

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ‘యంగ్ టైగర్ ఎన్టీఆర్’ హీరోగా రాబోతున్న పాన్ ఇండియా సినిమా ‘దేవర పార్ట్ 1’. ప్రస్తుతం ఈ సినిమాలోని బ్యాలెన్స్ సీక్వెన్స్ ల షూటింగ్ శరవేగంగా సాగుతోంది. వచ్చే వారం ఎన్టీఆర్, జాన్వీ కపూర్ కాంబినేషన్‌లో ఓ రొమాంటిక్ సాంగ్ చిత్రీకరణకు మూవీ యూనిట్ ప్లాన్ చేసిందట. ఇందుకోసం హైదరాబాద్ శివార్లలో సెట్‌ను తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది. అన్నట్టు ఈ సాంగ్ ఘాట్ కూడా పూర్తి చేస్తే.. ఇక దేవర పార్ట్ 1 టాకీ పార్ట్ మొత్తం పూర్తి అవుతుందని తెలుస్తోంది.

కాగా ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. మొత్తానికి దేవర సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. అనిరుధ్ రవిచందర్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో షైన్ టామ్ చాకో, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎన్టీఆర్ దేవర సినిమా కాకుండా ప్రస్తుతం హృతిక్ రోష‌న్‌ తో కలిసి మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా మల్టీస్టారర్ ‘వార్ 2’లో కూడా నటిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు