సూర్య, కార్తీక్ సుబ్బరాజ్ ప్రాజెక్ట్ పై లేటెస్ట్ అప్డేట్

కోలీవుడ్ వెర్సటైల్ స్టార్ హీరో సూర్య హీరోగా దిశా పటాని హీరోయిన్ గా దర్శకుడు శివ కాంబినేషన్ లో చేస్తున్న భారీ చిత్రం “కంగువ” కోసం తెలిసిందే. మరి భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా తర్వాత సూర్య మరిన్ని సినిమాలు చేయనుండగా ఈ సినిమాల్లో సర్ప్రైజింగ్ అనౌన్సమెంట్ చిత్రం దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తో ప్రాజెక్ట్ అని చెప్పాలి. మరి ఈ చిత్రం పై లేటెస్ట్ అప్డేట్ ఒకటి బయటకి వచ్చింది.

రీసెంట్ గా కార్తీక్ సుబ్బరాజ్ తండ్రి మాట్లాడుతూ ఈ సినిమా ఎప్పుడు నుంచి మొదలు కానుంది అనేది రివీల్ చేశారు. ఈ సినిమా ఈ ఏడాది జూన్ నెల నుంచి స్టార్ట్ కానున్నట్టుగా వారు కన్ఫర్మ్ చేశారు. దీనితో సూర్య తన సినిమాల విషయంలో ఎంత సూపర్ స్పీడ్ గా ఉన్నాడో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ మేకర్స్ “లవ్ లాఫర్ వార్” అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ని లాక్ చేయగా మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ సంగీతం అందించనున్నాడు.

Exit mobile version