‘రంగమార్తాండ’లో ఆ సీక్వెన్సే మెయిన్ హైలైట్ !

Published on Jul 6, 2021 12:48 am IST

టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ ‘కృష్ణ వంశీ’ గత కొన్ని సంవత్సరాలుగా హిట్ కోసం ఎదురుచూస్తూ ఈ క్రమంలో చేస్తోన్న సినిమా ‘రంగమార్తాండ’. కాగా ఈ సినిమా కోసం కృష్ణవంశీ అన్ని రకాల జాగ్రతలు తీసుకుంటున్నాడు. మరాఠీలో సూపర్ హిట్టయిన సినిమాను రంగమార్తాండగా తీసుకువస్తున్నాడు. ఈ సినిమా కోసం కీ రోల్స్ లో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణను, శివాత్మిక, బ్రహ్మానందం, అనసూయ నటిస్తున్నారు.

అయితే ఇంటర్వెల్ సీక్వెన్స్ లో వచ్చే సీన్స్ ఈ సినిమాకే మెయిన్ హైలైట్ గా నిలుస్తాయట. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణలతో పాటు శివాత్మిక నటన కూడా అద్భుతంగా ఉంటుందని తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో శివాత్మిక రాజశేఖర్ పాత్ర చాల బలమైనదట, పైగా కృష్ణవంశీ ఈ పాత్రను చాల ప్రత్యేకంగా డిజైన్ చేశాడట. మొత్తానికి పాత్ర బలంగా ఉండటంతో శివాత్మిక నటన కూడా చాల బాగా ఎలివేట్ అయిందట.

సంబంధిత సమాచారం :