మహేష్ కొత్త సినిమా పై మరో రూమర్

మహేష్ కొత్త సినిమా పై మరో రూమర్

Published on Feb 12, 2024 3:39 PM IST

స్టార్ దర్శకుడు రాజమౌళి – సూపర్ స్టార్ మహేష్ బాబు కలయికలో ఓ సినిమా రాబోతుంది. ఈ సినిమా రాజమౌళి కేఎల్ నారాయణకు చేస్తున్నారు. అయితే, జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని టాక్. ఇందుకోసం హైదరాబాద్ శివార్లలో ఓ భారీ సెట్‌ ను సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. ఓ యాక్షన్ ఎపిసోడ్ తో షూట్ స్టార్ట్ కానుందట. ఇక, ఈ సినిమాలో ప్రముఖ ఇండోనేషియన్ బ్యూటీ చెల్సియా ఇస్లాన్ హీరోయిన్ పాత్రలో నటిస్తోందని పుకార్లు వినిపిస్తున్నాయి. ఇంతకీ, ఈ వార్తలో ఎంత వాస్తవం ఉందో చూడాలి.

కాగా ఆ మధ్య విజయేంద్రప్రసాద్‌ ఈ సినిమా కథ గురించి ఓ ఇంటర్వ్యూలో చెబుతూ.. ‘నేను, రాజమౌళి ఇద్దరం దక్షిణాఫ్రికా నవలా రచయిత విల్బర్‌ స్మిత్‌ కు పెద్ద అభిమానులం. అందుకే ఆయన పుస్తకాల ఆధారంగానే ఈ సినిమా స్క్రిప్ట్ ను రాశాను’ అంటూ చెప్పుకొచ్చారు. కాబట్టి రాజమౌళి – మహేష్ సినిమా ఒక అడ్వెంచర్ థ్రిల్లర్‌ గా ఉండబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు