మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్టు ఫైనల్ వెర్షన్ జరుగుతోంది. కాగా ఈ సినిమాలో మెగా అభిమానులు కోరుకునే అంశాలతో పాటు హీరో ఎలివేషన్స్ తో కూడుకునే బోలెడంత హీరోయిజమ్ ఉండనుంది. ఎలాగూ దేవి శ్రీ మంచి సాంగ్స్ ఇస్తాడు.. వాటికి మెగాస్టార్ అదిరిపోయే స్టెప్స్ ఉంటాయి. ఇక అన్నిటికంటే ప్రధానమైన సోషల్ ఇష్యూ తప్పకుండా ఉంటుంది. మొత్తంగా చెప్పాలంటే మెగాస్టార్ – కొరటాల నుండి ఒక పవర్ ప్యాక్డ్ కమర్షియల్ ఎంటెర్టైనర్ రానుంది.
ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జనవరి ఎండింగ్ లో మొదలు కానుందని.. రామోజీ ఫిల్మ్ సిటీలో వరుసగా ఇరవై రోజులు పాటు సినిమాలోని కొన్ని కీలక సన్నివేవాలను షూట్ చేయనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో మెగాస్టార్ సరసన కాజల్ అగర్వాల్ ను హీరోయిన్ గా తీసుకోనున్నారని సమాచారం. కొరటాల శివ, మెగాస్టార్ కోసం ఓ మంచి సోషల్ మెసేజ్ తో కూడుకున్న స్క్రిప్ట్ ను తయారు చేసారట. అన్నట్లు ప్రభాస్ – కొరటాల శివ కాంబినేషన్‌లో మరో సినిమా రానుందని తెలుస్తోంది.


