మెగాస్టార్ చిరంజీవి యంగ్ స్టార్ డైరెక్టర్ సుజీత్ తో ‘లూసిఫర్’ తెలుగు రీమేక్ చేయబోతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా గురించి ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోన్న లేటెస్ట్ అప్ డేట్ ఏమిటంటే, తెలుగు ఆడియన్స్ కోరుకునే ఎమోషన్స్ కి తగ్గట్టుగా లూసిఫెర్ స్క్రిప్ట్ లో సుజీత్ భారీ మార్పులు చేశాడట. ఆ మార్పులు చిరుకి కూడా నచ్చాయని ఫైనల్ గా మెగాస్టార్ స్క్రిప్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని.. ప్రస్తుతం సాయి మాధవ్ బుర్రా డైలాగ్ వెర్షన్ రాస్తున్నారని తెలుస్తోంది. ఇక ఈ సిని క్యాస్టింగ్ విషయంలో కూడా భారీగానే ప్లాన్ చేశారట.
మెయిన్ గా ఈ సినిమాలో మెగాస్టార్ అనుచరుడి పాత్ర కథా పరంగా చాల కీలకంగా ఉంటుంది. ఎందుకంటే సినిమాలో హీరో ఏమి చేయడు, ఏదైనా తన అసిస్టెంట్ చేతే చేయిస్తూ ఉంటాడు. అ రకంగా సెకెండ్ హీరో రేంజ్ క్యారెక్టర్ అది. అందుకే ఆ పాత్రలో విజయ్ దేవరకొండను తీసుకునే ఆలోచనలో ఉన్నారు. అలాగే హీరో చెల్లి పాత్ర కూడా కీలకమే. ఆ పాత్రలో సుహాసిని కనిపించబోతుందని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇక ఈ సినిమాలో హీరోయిజమ్ ఎలివేషన్స్ ఉన్న సీన్స్ మెయిన్ హైలైట్ గా ఉండేలా.. మెగా అభిమానులకు ఫుల్ జోష్ ని ఇచ్చేలా సినిమాని తెరకెక్కించాలని సుజిత్ షాట్ మేకింగ్ పై ప్రత్యేక దృష్టి పెట్టాడట.
