మెగాస్టార్ “విశ్వంభర” పై లేటెస్ట్ అప్డేట్.!

మెగాస్టార్ “విశ్వంభర” పై లేటెస్ట్ అప్డేట్.!

Published on Feb 13, 2024 11:23 AM IST


మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఇప్పుడు చేస్తున్న భారీ చిత్రం “విశ్వంభర” కోసం తెలిసిందే. చాలా కాలం తర్వాత మెగా ఫ్యాన్స్ అంతా కూడా ఓ రేంజ్ లో ఎదురు చూస్తున్న సినిమా ఏదన్నా ఉంది అంటే అది ఇదే అని చెప్పాలి. మెగాస్టార్ తన కెరీర్ లో చేసిన ఎన్నో సెన్సేషనల్ వండర్స్ తర్వాత మళ్ళీ భారీ ఫాంటసీ డ్రామాని అనౌన్స్ చేయడం అంచనాలు పీక్స్ కి వెళ్లాయి. మరి రీసెంట్ గానే మేకర్స్ ఓ ఇంట్రెస్టింగ్ షెడ్యూల్ ని ఈ ఫిబ్రవరి స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే.

మరి ఇప్పుడు సక్సెస్ ఫుల్ గా ఈ షెడ్యూల్ ని అయితే కంప్లీట్ చేసారని తెలుస్తుంది. ఇక ఈ షెడ్యూల్ ని భారీ సెట్టింగ్స్ నడుమ చిత్రీకరించిన సంగతి తెలిసిందే. అలాగే పలు కీలక యాక్షన్ సీన్స్ కూడా ఈ షెడ్యూల్ లో తెరకెక్కించినట్టుగా కూడా సమాచారం. మొత్తానికి అయితే ఈ భారీ చిత్రం ప్లానింగ్ ప్రకారం షూటింగ్ కంప్లీట్ చేసేసుకుంటుంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తుండగా యంగ్ దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్నాడు అలాగే యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు