మోక్షజ్ఞ కోసం కథలు వింటున్న బాలయ్య

మోక్షజ్ఞ కోసం కథలు వింటున్న బాలయ్య

Published on Mar 4, 2024 6:48 PM IST

నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ పై చాలా ఏళ్ల నుంచి బాలయ్య అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ మధ్య బాలకృష్ణ కూడా.. తన కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీ ఈ ఏడాది ఉంటుందని చెప్పిన సంగతి తెలిసిందే. ఐతే, తాజాగా బాలయ్య తన కుమారుడి ఎంట్రీ ఫిల్మ్ కోసం కథలు వింటున్నట్లు తెలుస్తోంది. ఎట్టిపరిస్థితుల్లో ఈ ఏడాది మోక్షజ్ఞ మొదటి సినిమా స్టార్ట్ అయ్యేలా బాలయ్య ప్లాన్ చేస్తున్నాడట. అందుకు తగ్గట్టుగానే మోక్షజ్ఞ కూడా తన ఫిజిక్ పై కఠినంగా వర్కౌట్స్ చేస్తున్నాడు.

రీసెంట్ గా వైరల్ అయిన పిక్ లో కూడా మోక్షజ్ఞ చాలా ఫిట్‌గా మారిపోయి కనిపించాడు. గత ఏడాది వరకూ బొద్దుగా ఉన్న అతను ప్రస్తుతం బరువు తగ్గి ఫిట్‌గా హీరో లుక్ లోకి మారిపోయాడు. పైగా ప్రస్తుతం వైజాగ్‌ లో సత్యానంద్ దగ్గర మోక్షజ్ఞ నటనలో శిక్షణ తీసుకుంటున్నట్లు కూడా తెలుస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే.. మోక్షజ్ఞ సినిమా త్వరలో ఉంటుంది. ఓ దశలో అయితే మోక్షజ్ఞ ఎంట్రీ మూవీ ‘ఆదిత్య 369’ సీక్వెల్ అని కూడా ప్రచారం జరిగింది. మధ్యలో దర్శకుడిగా త్రివిక్రమ్ పేరు కూడా వినిపించింది. మరి చివరకు ఏ దర్శకుడు ఫిక్స్ అవుతాడో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు