నాచురల్ స్టార్ నాని హీరోగా కయాదు లోహర్ హీరోయిన్ గా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ‘ది ప్యారడైజ్’ కోసం అందరికీ తెలిసిందే. టాలీవుడ్ నుంచి నెక్స్ట్ భారీ సినిమాగా దీనిపై అనేక అంచనాలు నెలకొన్నాయి. దీనితో నాని డెఫినెట్ గా టైర్ 1 హీరోల లిస్ట్ లోకి వెళ్లిపోవడం గ్యారెంటీ అని అంతా కూడా ఫిక్స్ అయ్యిపోయారు.
అయితే విడుదల వాయిదా పడుతున్న నేపథ్యంలో మెల్లగా అంచనాలు సన్నగిల్లాయి. కానీ ఫ్యాన్స్ కి ఫైనల్ గా ఫుల్ జోష్ ఇస్తూ వచ్చిన టీజర్ అప్డేట్ ఇపుడు మరోసారి మంచి హైప్ ని నెలకొల్పింది. ఇక ఇదిలా ఉండగా ప్యారడైజ్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇపుడు తెలుస్తుంది.
ఇటీవల బ్యూటీ కీర్తి సురేష్ స్పెషల్ సాంగ్ చేస్తుంది అని తెలిసిందే. ఈ సాంగ్ కొంచెం మాత్రమే బ్యాలన్స్ ఉందట. ఈ సాంగ్ ని ఆగస్ట్ 6 నాటికే కంప్లీట్ చేసేస్తారని తెలుస్తుంది. సో పక్కా ప్లాన్ ప్లాన్ ప్రకారం అన్ని కంప్లీట్ చేసి టీజర్ సహా దానితోనే రిలీజ్ డేట్ ని కూడా ప్రకటించనున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా ఎస్ ఎల్ వి సినిమాస్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.


