ఇంట్రస్టింగ్ అప్ డేట్ తో నాని ‘వి’ !

ఇంట్రస్టింగ్ అప్ డేట్ తో నాని ‘వి’ !

Published on Feb 24, 2020 12:00 AM IST

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం టాలెంటెడ్ డైరెక్టర్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందుతున్న ‘వి’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఈ సినిమా నుండి ఒక ఇంట్రస్టింగ్ అప్ డేట్ తెలిసింది. ఈ సినిమా క్లైమాక్స్ లో సినిమా కథ మొత్తాన్నీ టర్న్ చేసే అద్భుతమైన ట్విస్ట్ ఒకటి రివీల్ అవుతుందని.. ఈ ట్విస్ట్ సినిమాలోనే బిగ్ హైలైట్ గా నిలుస్తోదని ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. అయితే ఈ ట్విస్ట్ నాని పాత్రకి సంబంధించిందట. మొత్తానికి ఇప్పటివరకూ ఇంద్రగంటి నానితో చేసిన రెండు చిత్రాల్లో నానిని డిఫ‌రెంట్‌గా చూపించి సక్సెస్ కొట్టాడు. మళ్ళీ ఇప్పుడు నానిని మ‌రో డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్‌లో ఆవిష్క‌రిస్తున్నాడు.

అలాగే సుధీర్‌బాబుతో `స‌మ్మోహ‌నం` వంటి బ్యూటీఫుల్ ల‌వ్‌స్టోరీని తెర‌కెక్కించిన ఇంద్ర‌గంటి ఈసారి సుధీర్‌ ను ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ రోల్‌ లో చూపిస్తున్నాడు. ఈ చిత్రంలో నాని పాత్ర‌కు ధీటుగా ఉండే ఐపీయ‌స్ ఆఫీస‌ర్ పాత్ర‌లో సుధీర్‌బాబు న‌టిస్తున్నాడు. నాని, సుధీర్ బాబు మ‌ధ్య నువ్వా నేనా? అనేలా వ‌చ్చే యాక్ష‌న్ స‌న్నివేశాలు సినిమాలో ప్రధాన ఆకర్షణగా ఉంటాయట. ఇక హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ నిర్మాణంలో శిరీష్‌, హ‌ర్షిత్ రెడ్డి నిర్మాత‌లుగా ఈ సినిమా నిర్మిత‌మ‌వుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు