Subscribe to our Youtube Channel
 
Like us on Facebook
 
నాని నిర్మాణంలో స్టార్ హీరోయిన్ !
Published on Jan 12, 2019 12:07 am IST

‘అ!’ సినిమాతో ప్రొడ్యూసర్ గా మారాడు నాని. కానీ హీరోగా వరస సినిమాలతో బిజీగా ఉండటం వల్ల.. ఆ తరువాత మళ్లీ ప్రొడక్షన్ సైడ్ పై పెద్దగా ఫోకస్ పెట్టలేదు. ఎట్టకేలకు మళ్లీ ఓ సినిమాకి నిర్మాతగా నాని వ్యవహరించబోతున్నాడు. సీనియర్ అండ్ స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ చెప్పిన లేడీ ఓరియెంటెడ్ కథ ఒకటి నానికి బాగా నచ్చిందట. దాంతో ఆ సినిమాని తనే నిర్మించాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.

కాగా ఆ కథలో సమంత మెయిన్ లీడ్ గా నటించనుందట. అయితే ఈ చిత్రానికి ఎవరు దత్సకత్వం వహిస్తారనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. ఇక నాని – సమంత గతంలో హీరోహీరోయిన్స్ గా నటించారు. అప్పటినుండి వీరి మధ్య మంచి స్నేహం ఉంది. ప్రస్తుతం నాని ‘జెర్సీ’ షూటింగ్ లో బిజీగా ఉండగా.. సమంత ‘మజిలీ’ షూటింగ్ లో బిజీగా ఉంది.

సంబంధిత సమాచారం :