‘టక్ జగదీష్’లో ఇంటర్వెల్ సీక్వెన్స్ హైలైట్ అట !

Published on Feb 29, 2020 3:01 am IST

టాలీవుడ్ లోని మినిమం గ్యారంటీ హీరోల్లో ఒకరైన నేచురల్ స్టార్ ‘నాని’ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో ‘టక్ జగదీష్’ సినిమా చేస్తున్నారు. ‘నిన్నుకోరి’ వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ లో తయారవుతున్న సినిమా ఇది. అయితే నాని ఈ సినిమాలో కొత్త లుక్ ట్రే చేస్తున్నాడట. అలాగే నాని క్యారెక్టరైజేషన్ లో చాల వేరియేషన్స్ ఉంటాయని తెలుస్తోంది. ముఖ్యంగా ఇంటర్వెల్ సీక్వెన్స్ లో నాని పాత్ర ద్వారా రివీల్ అయ్యే ట్విస్ట్ సినిమా మొత్తానికి హైలైట్ గా నిలుస్తోందట.

ఇక షైన్ స్రీన్స్ పతాకం పై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది నానికి 26వ చిత్రం. నానితో ఇదివరకు ‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమాలో నటించిన రీతు వర్మ, ‘కౌసల్యా కృష్ణమూర్తి’ ఫేమ్ ఐశ్వర్యా రాజేష్ ఈ మూవీలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్. తమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫరుగా పనిచేస్తున్నారు. మరి నిన్ను కోరి మేజిక్ రిపీట్ అవుతుందేమో చూడాలి.

సంబంధిత సమాచారం :

X
More