సూర్య ‘ఎన్జీకే ‘ ఫైనల్ షెడ్యూల్ అప్డేట్ !

సూర్య ‘ఎన్జీకే ‘ ఫైనల్ షెడ్యూల్ అప్డేట్ !

Published on Nov 8, 2018 9:23 AM IST

సెల్వ రాఘవన్ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న 36వ చిత్రం ‘ఎన్జీకే’ చివరి షెడ్యూల్ నవంబర్ చివరి వారంలో స్టార్ట్ కానుంది. దాదాపుగా 15రోజుల పాటు చెన్నై లో జరుగనున్న ఈ షెడ్యూల్ తో సినిమా చిత్రీకరణ పూర్తి కానుంది. ఇక ఈచిత్రాన్ని డిసెంబర్ చివరి వారంలోకానీ లేదా జనవరి మొదటి వారంలో కానీ విడుదల చేసే అవకాశాలు వున్నాయి. నిజానికి ఈ దీపావళి కి విడుదల కావల్సిన ఈచిత్రంషూటింగ్ లో జాప్యం వల్ల వెనక్కి వెళ్ళిపోయింది.

పొలిటికల్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ , సాయి పల్లవిలు కథానాయికలుగా నటిస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకం ఫై ఎస్ఆర్ ప్రకాష్ బాబు -ఎస్ఆర్ ప్రభు నిర్మిస్తున్న ఈచిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు