ఆల్ రెడీ ‘పవన్’ పై ఫోటో షూట్‌ చేశారట !

ఆల్ రెడీ ‘పవన్’ పై ఫోటో షూట్‌ చేశారట !

Published on Apr 13, 2021 10:18 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరల్ అవుతుంది. పవన్ కళ్యాణ్ ఇటీవలే ఈ సినిమా కోసం ప్రత్యేక ఫోటోషూట్‌లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. పవర్ స్టార్ ఈ సినిమాలో తన లుక్ కోసం ఈ ఫోటో షూట్ చేసారట. ఈ షూట్ హరీష్ శంకర్ పర్యవేక్షణలో జరిగింది. ఇక అక్టోబర్ నుండి ఈ సినిమా రెగ్యులర్ షూట్ ప్రారంభమవుతుంది.

ఇక ఈ సినిమాలో పవన్ ప్లాష్ బ్యాక్ లో పోలీస్ ఆఫీసర్ గా నటించబోతున్నాడని.. అలాగే ప్లాష్ బ్యాక్ లో వచ్చే తండ్రి పాత్రలోనూ.. అలాగే లైవ్ లో వచ్చే కొడుకు పాత్రలోనూ పవన్ ఈ సినిమాలో రెండు పాత్రల్లో కనిపిస్తాడని.. ఇక తండ్రి పాత్రది పోలీస్ ఆఫీసర్ పాత్ర అని ఇలా ఒక రూమర్ ఒకటి బాగా హల్ చల్ చేస్తోంది. అయితే ఈ రూమర్ లో ఎలాంటి వాస్తవం లేదని తెలుస్తోంది.

కాగా గతంలో హరీష్, పవన్ కాంబినేషన్లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ పవన్ కెరీర్ లోనే ప్రత్యేకంగా నిలిచిపోయింది. అప్పటికే వరుస ప్లాప్స్ లో ఉన్న పవన్.. గబ్బర్ సింగ్ తో ఇండస్ట్రీ రికార్డ్స్ క్రియేట్ చేశాడు. అందుకే వీరి సినిమా పై అభిమానుల్లోనే కాదు ప్రేక్షకులందరిలో మంచి ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు