పవన్ ‘విరూపాక్ష’ జూలై నుండి.. ?

పవన్ ‘విరూపాక్ష’ జూలై నుండి.. ?

Published on Apr 18, 2020 5:00 AM IST

కరోనా మహమ్మారి పై యుద్ధంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన అభిమానులను బాగానే అప్రమత్తం చేస్తున్నారు. ఇక పవర్ స్టార్ ఇటు రాజకీయాలతో పాటు అటు బ్యాక్ టు బ్యాక్ సినిమాలనూ ఒప్పుకుంటన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వేణు శ్రీరామ్ మరియు క్రిష్ లతో చేస్తోన్న సినిమాల షూట్ లో పవన్ పాల్గొన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం క్రిష్ సినిమాకి పవన్ లాంగ్ గ్యాప్ ఇవ్వబోతున్నాడట. నిజానికి ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో కొత్త షెడ్యూల్ రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభమవ్వాలి. కానీ కరోనా కారణంగా పవన్ ఈ షెడ్యూల్ ను క్యాన్సల్ చేశారు.

అయితే తాజాగా పవన్ మరో జూలై వరకూ తన పార్ట్ కు సంబంధించి ఎలాంటి షూట్ ను ప్లాన్ చెయ్యొద్దు అని పవన్ చిత్రబృందానికి తెలిపాడట. ఇక క్రిష్ తో చేస్తోన్న ఈ సినిమా ఒక పిరియాడికల్ బ్యాక్ డ్రాప్లో నడిచే చిత్రమని, ఇందులో పవన్ రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపిస్తారనే వార్తలు వచ్చాయి. అన్నట్టు ఈ చిత్రానికి ‘విరూపాక్ష’ అనే పేరును అనుకుంటున్నారు. అయితే చిత్ర బృందం నుండి మాత్రం ఇంకా ఎలాంటి అప్డేట్ వెలువడలేదు. ప్రముఖ నిర్మాత ఏ ఎమ్ రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు