ప్రభాస్ పక్కా ఎంటర్టైనర్ పై లేటెస్ట్ అప్డేట్.!

ప్రభాస్ పక్కా ఎంటర్టైనర్ పై లేటెస్ట్ అప్డేట్.!

Published on Feb 15, 2024 4:04 PM IST


పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మాళవిక మోహనన్ హీరోయిన్ గా దర్శకుడు మారుతీ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా ఎంటర్టైనర్ చిత్రం “రాజా సాబ్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రంతో మళ్ళీ పాత ప్రభాస్ ని చూపిస్తానని దర్శకుడు కాన్ఫిడెంట్ గా ఉండగా ఈ చిత్రం పనులు అన్నీ కంప్లీట్ చేసుకుంటుంది.

ఇక షూటింగ్ పరంగా కూడా ప్లానింగ్ ప్రకారం ఆలస్యం లేకుండా కొనసాగుతున్న ఈ సినిమాపై లేటెస్ట్ బజ్ తెలుస్తుంది. దీని ప్రకారం ఈ చిత్రం సరికొత్త షెడ్యూల్ నెక్స్ట్ వీక్ నుంచి మొదలు కానుంది అని తెలుస్తుంది. అలాగే దాదాపు ప్రభాస్ లేని సన్నివేశాలను అయితే మేకర్స్ చిత్రీకరిస్తారట.

ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే దాదాపు ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది రిలీజ్ కి ఉండేలా సన్నాహాలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు