ప్రభాస్ ‘కల్కి..’లో విజయ్… నిజమిదే ?

ప్రభాస్ ‘కల్కి..’లో విజయ్… నిజమిదే ?

Published on Jan 21, 2024 12:07 AM IST

నేషనల్ స్టార్ ప్రభాస్ నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ‘కల్కి 2898 AD’ అనే ఫాంటసీ సైంటిఫిక్ మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా పై ఇప్పటికే ఎన్నో పుకార్లు వైరల్ అయ్యాయి. ఇందులో భాగంగా ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఓ అతిథి పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. విజయ్ దేవరకొండ గతంలో నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో ఎవడే సుబ్రమణ్యం, మహానటి వంటి సినిమాల్లో అతిథి పాత్రలు చేశాడు.

దాంతో, ప్రభాస్ ‘కల్కి’ సినిమాలో కూడా విజయ్ దేవరకొండ నటిస్తున్నాడు అనగానే అందరూ నమ్మారు. కానీ, తాజాగా వినిపిస్తున్న అప్ డేట్ ప్రకారం ఈ సినిమాలో విజయ్ దేవరకొండ నటించడం లేదు అని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్‌ స్టార్ అమితాబ్ బచ్చన్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. మొత్తానికి పాన్ -ఇండియా చిత్రంగా ఈ సినిమాని మలచడానికి నాగ్ అశ్విన్ బాగా ప్రయత్నాలు చేస్తున్నాడు. వైజయంతీ మూవీస్‌ పతాకంపై అశ్వనీదత్‌ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు