‘స్పిరిట్‌’లో హీరోయిన్లు వాళ్లే ?

‘స్పిరిట్‌’లో హీరోయిన్లు వాళ్లే ?

Published on Apr 29, 2024 8:00 AM IST

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా యానిమల్ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టాడు. దీంతో పాన్ ఇండియా దర్శకుడిగా సందీప్ రెడ్డికి బలమైన మార్కెట్ క్రియేట్ అయ్యింది. ఐతే, ఈ దర్శకుడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ‘స్పిరిట్‌’ అనే సినిమా రాబోతుంది. ఈ సినిమా స్క్రిప్ట్‌ పనుల్లో సందీప్ బిజీగా ఉన్నారు. ఈ సినిమా డిసెంబర్‌ నుంచి పట్టాలెక్కనుంది. ఐతే, తాజాగా ఈ సినిమాకి సంబంధించి మరో క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ నటిస్తోందని తెలుస్తోంది.

మరి, కియారా అద్వానీ, నిజంగానే ప్రభాస్ సరసన నటిస్తే.. ఆ క్రేజే వేరు. అలాగే, ఈ సినిమాలో మరో హీరోయిన్ కి కూడా స్కోప్ ఉందని.. ఆ పాత్రలో నయనతార ను తీసుకునే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో ఎంత వాస్తవం ఉందో చూడాలి. అన్నట్టు ప్రభాస్ నుంచి ప్రేక్షకులు ఏదైతే బలంగా కోరుకుంటున్నారో అదే ఈ సినిమాలో ఉంటుందట. ఇప్పటికే, 60 శాతం స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. రూ.300 కోట్లకు పైగా బడ్జెట్‌ తో ఈ సినిమా తెరకెక్కనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు