‘పుష్ప 2’ పై క్రేజీ రూమర్

‘పుష్ప 2’ పై క్రేజీ రూమర్

Published on May 29, 2024 8:56 AM IST

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రాబోతున్న సినిమా పుష్ప 2: ది రూల్. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఐతే, ప్రస్తుతం ఈ సినిమా ఇంటర్వెల్ పై ఓ రూమర్ వైరల్ అవుతుంది. ఈ సినిమా ఇంటర్వెల్ లో ప్రేక్షకులు ఊహించని ట్విస్ట్ ఉంటుందని.. సినిమా మొత్తానికే ఈ సినిమా ఇంటర్వెల్ అదిరిపోతోందని తెలుస్తోంది.

ఎలాగూ ఈ సినిమా తొలి పాట బాగా హిట్ అయ్యింది. పైగా ఈ మొదటి సాంగ్ సోషల్ మీడియాతో సహా వరల్డ్ వైడ్ గా మ్యూజిక్ ఛార్ట్స్ ని రూల్ చేసింది. ఏది ఏమైనా ‘పుష్ప 2’ కోసం ఫ్యాన్స్ రెట్టింపు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించింది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. ఆగస్టు 15న, 2024 లో ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు