రాహుల్ రవీంద్రన్ కు లక్కీ ఛాన్స్ !

రాహుల్ రవీంద్రన్ కు లక్కీ ఛాన్స్ !

Published on Jul 6, 2018 9:01 PM IST

Rahul Ravindran

తెలుగు ,తమిళ భాషల్లో హీరో గా మరియు సపోర్టింగ్ యాక్టర్ గా నటిస్తూ మంచి గుర్తింపును పొందిన నటుడు రాహుల్ రవీంద్రన్. ఇటీవల’ హౌరా బ్రిడ్జ్’ చిత్రంతో ప్రేక్షకులముందుకు వచ్చిన ఆయనకు ఈ చిత్రం పరాజయాన్ని మిగిల్చింది. ఇక ఇప్పుడు దర్శకుడిగా మారి సుశాంత్ హీరో గా ‘చి ల సౌ’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు .

ఈ చిత్రం తరువాత ఆయన తన రెండవ సినిమా ను ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణంలో డైరెక్ట్ చేయనున్నారు . ఈ అవకాశం రావడం పట్ల అయన తన ఆనందాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. అలాగే ఈ చిత్రానికి సంబందించిన నటీనటులు , సాంకేతిక నిపుణల వివరాలను త్వరలోనే వెల్లడిస్తానన్నారు,

తాజా వార్తలు