‘చరణ్’ తాతయ్యగా అమితాబ్ ?

‘చరణ్’ తాతయ్యగా అమితాబ్ ?

Published on Apr 2, 2024 1:28 AM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సానాతో ఓ భారీ చిత్రం రాబోతుంది. కాగా ఈ చిత్రం అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో బిగ్.బి అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్రలో నటించబోతునట్లు తెలుస్తోంది. అమితాబ్ చరణ్ కి తాతయ్య పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. తాతయ్య – మనవడి మధ్య రిలేషన్ కూడా సినిమాలో మెయిన్ హైలైట్ గా ఉంటుందని.. తాతయ్య కోరిక కోసం మనవడు ఏం సాధించాడు అనే కోణంలో ఈ సినిమా సాగుతుందట.

కాగా ఈ సినిమాలో రామ్‌ చరణ్‌ సరసన హీరోయిన్ గా జాన్వీకపూర్‌ నటించనుంది. ఇక ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ తో కలిసి నిర్మాత వెంకట సతీష్ కిలారు ఈ సినిమాకి నిర్మాణం వహిస్తున్నారు. అన్నట్టు యానిమల్ సినిమాతో విలన్ గా ఫామ్ లోకి వచ్చిన బాబీ డియోల్ కూడా ఈ సినిమాలో నటించే ఛాన్స్ ఉందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. తాజాగా అమితాబ్ పేరు కూడా వినిపిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు