‘చరణ్’ సినిమాలో బాబీ డియోల్ ?

‘చరణ్’ సినిమాలో బాబీ డియోల్ ?

Published on Feb 26, 2024 10:00 AM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సానాతో ఓ భారీ చిత్రం రాబోతుంది. కాగా ఈ చిత్రం అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రీసెంట్ గానే ఈ సినిమాలో రామ్‌ చరణ్‌ సరసన హీరోయిన్ గా జాన్వీకపూర్‌ నటించనుంది అని రివీల్ చేశారు. ఇప్పుడు ఈ సినిమాలోని మరో కీలక పాత్ర పై కూడా లేటెస్ట్ అప్ డేట్ వినిపిస్తోంది. ఈ సినిమా సెకండ్ హాఫ్ లో ఓ కీలక పాత్ర ప్రధానంగా ఉంటుందని.. ఈ పాత్రలో బాలీవుడ్ హీరోని తీసుకున్నారని తెలుస్తోంది.

యానిమల్ సినిమాతో విలన్ గా ఫామ్ లోకి వచ్చిన బాబీ డియోల్ ను ఈ సినిమా కోసం తీసుకున్నారట. మరి ఈ వార్తలో ఏ మాత్రం నిజం ఉందో తెలియాలంటే.. మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాలి. ఇక ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ తో కలిసి నిర్మాత వెంకట సతీష్ కిలారు ఈ సినిమాకి నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు