అక్టోబర్‌ లో రాబోతున్న ‘గేమ్ ఛేంజర్’

అక్టోబర్‌ లో రాబోతున్న ‘గేమ్ ఛేంజర్’

Published on May 29, 2024 7:30 PM IST

స్టార్ డైరెక్టర్ శంకర్ – మెగాపవర్ స్టార్ ‘రామ్ చరణ్ తేజ్’ కాంబినేషన్ లో రాబోతున్న పాన్ ఇండియా సినిమా గేమ్ ఛేంజర్‌. కాగా ‘గేమ్ ఛేంజర్’ సినిమా రిలీజ్ పై తాజాగా దిల్‌రాజు కూతురు హన్షిత రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఆమె మాట్లాడుతూ.. ‘గేమ్ ఛేంజర్ సినిమాను అక్టోబర్‌లో రిలీజ్ చేయనున్నట్లు హన్షిత రెడ్డి వెల్లడించారు. హన్షిత రెడ్డి ఇంకా మాట్లాడుతూ.. ‘ఈ సినిమా స్టోరీ డిఫరెంట్‌గా ఉంటుందని ఆమె తెలిపారు.

దర్శకుడు శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్‌ గా నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. కాగా హన్షిత రెడ్డి ‘బలగం’తో పాటు పలు చిత్రాలకు సహ నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అంజలి, శ్రీకాంత్, ఎస్‌జె సూర్య, నవీన్ చంద్ర వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు