‘ఆర్ఆర్ఆర్’ లేటెస్ట్ అప్డేట్ !

‘ఆర్ఆర్ఆర్’ లేటెస్ట్ అప్డేట్ !

Published on Nov 22, 2018 11:58 AM IST

అగ్ర దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం యొక్క షూటింగ్ ఇటీవలే స్టార్ట్ అయిన విషయం తెలిసిందే. ఈమొదటి షెడ్యూల్ లో ఎన్టీఆర్ , రామ్ చరణ్ లపై కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ దృశ్యాలను చిత్రీకరంచడానికి ఏకంగా 120 కెమెరాలను వాడుతున్నారు చిత్ర సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్.

ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో డివివి ఎంటర్టైన్మెంట్ పతాకం ఫై దానయ్య డివివి నిర్మిస్తున్నారు. ఇక ఈచిత్రానికి హీరోయిన్లు ను ఖరారు చేయాల్సివుంది. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం 2020 లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు