
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లు హీరోలుగా నటించిన లేటెస్ట్ భారీ చిత్రం “రౌద్రం రణం రుధిరం” ఇప్పుడు ఎలాంటి అంచనాలు నెలకొల్పుకొని రిలీజ్ కి వస్తుందో తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్లో అన్ని భాషల్లోని సాలిడ్ ప్రమోషన్స్ ని జరుపుకుంటున్న ఈ చిత్రం ఇప్పుడిప్పుడే హిందీలో కూడా బుకింగ్స్ ని ఓపెన్ చేసుకుంటుంది.
మరి ప్రస్తుతానికి ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తెలుస్తుంది. లేటెస్ట్ టాక్ ప్రకారం అయితే ప్రస్తుతం ఈ భారీ సినిమా 1.7 కోట్ల మార్క్ ని క్రాస్ చేసిందట. అలాగే ఈ సినిమా ఒక్క హిందీలోనే రికార్డు స్థాయి థియేటర్స్ లో విడుదల అవుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ సినిమా ఒక్క హిందీ వెర్షన్ లో మాత్రమే 3400 స్క్రీన్స్ లో రిలీజ్ అవుతుందట. మరి హిందీలో ఈ సినిమా ఏ స్థాయి ఓపెనింగ్స్ అందుకుంటుందో చూడాలి.