“RRR” షూట్ పై లేటెస్ట్ అప్డేట్..!

Published on Mar 7, 2021 8:38 am IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో దర్శక ధీరుడు రాజమౌళి “రౌద్రం రణం రుధిరం” అనే భారీ బడ్జెట్ అండ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ పాన్ ఇండియన్ సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. మరి అలాగే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ కూడా శరవేగంగా జరుపుకుంటుంది. ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రం తారక్ కొమరం భీమ్ గా చరణ్ అల్లూరిగా నటిస్తున్న సంగతి కూడా తెలిసిందే.

అయితే ఇప్పుడు వీరిలో ఒకరి షూట్ కి సంబంధించి అప్డేట్ ఒకటి తెలుస్తుంది. వచ్చే వారం నుంచి మేకర్స్ చరణ్ మరియు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ పై ఒక బ్యూటిఫుల్ అండ్ రొమాంటిక్ నెంబర్ ను షూట్ చెయ్యనున్నారట. దీని కోసం ఒక స్పెషల్ సెట్ ను కూడా మేకర్స్ వేసినట్లు తెలుస్తుంది. మరి ఈ సాంగ్ సిల్వర్ స్క్రీన్ పై ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ భారీ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తుండగా డివివి దానయ్య 400 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :