సాహో లేటెస్ట్ అప్డేట్ !

Published on Feb 5, 2019 8:29 am IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘సాహో’ చిత్రం యొక్క గ్రాఫిక్స్ వర్క్ 50 శాతం కంప్లీట్ అయ్యింది. ఇండియాలోనే భారీ విజువల్స్ తో రానున్న మొదటి చిత్రం ఇదే కావడం విశేషం. మే కల్లా చిత్రం యొక్క పూర్తి వర్క్ పూర్తి కానుంది. జూలై నుండి ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసి ఆగష్టు 15న స్వాతంత్య దినోత్సవం రోజున తెలుగు , హిందీ , తమిళ భాషల్లో భారీ స్థాయిలో చిత్రాన్ని విడుదలచేయ నున్నారు. ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. భారీ బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శంకర్ ఎహసాన్ లాయ్ సంగీతం అందిస్తున్నారు. హాలీవుడ్ స్టంట్ మాస్టర్లు కంపోజ్ చేసిన యాక్షన్ సన్నివేశాలు ఈచిత్రంలో హైలైట్ అవ్వనున్నాయి.

ఇక ప్రభాస్ ఈ చిత్రం తో పాటు ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో తన 20వ చిత్రం లో కూడా నటిస్తున్నాడు. ఇటీవల ఈ చిత్రం ఇటలీ లో మొదటి షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకుంది.

సంబంధిత సమాచారం :