ఎన్టీఆర్ 31, కేజీఎప్-3 తర్వాతే సలార్ 2 ?

ఎన్టీఆర్ 31, కేజీఎప్-3 తర్వాతే సలార్ 2 ?

Published on Feb 19, 2024 11:00 AM IST

ప్రభాస్ నటించిన ‘సలార్’ సినిమా సూపర్ హిట్ కావడంతో ‘సలార్’ సీక్వెల్‌ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఐతే, ఈ సినిమా షూటింగ్‌ ను ఈ ఏడాది నుంచే ప్రారంభించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ, డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌ ప్లానింగ్ మరోలా ఉంది. సలార్ 2మూవీ కంటే ముందే ఎన్టీఆర్ 31, కేజీఎప్-3 తీయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, దేవర, వార్-2 షూటింగులతో ఎన్టీఆర్ బిజీగా ఉండటంతో దర్శకుడు ప్రశాంత్‌ నీల్ తో ఆయన చేయాల్సిన మూవీ ఆలస్యమయ్యే ఛాన్స్ ఉంది.

కాబట్టి, ఈ లోపు ప్రశాంత్‌ నీల్ కేజీఎప్-3ని ఫినిష్ చేసే అవకాశం ఉంది. మరోవైపు గత ఏడాది డిసెంబర్ 22న రిలీజైన సలార్ పార్ట్-1 రూ.715కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన సంగతి తెలిసిందే. హోంబలే ఫిలిమ్స్ నుంచి కూడా సలార్-2ను త్వరగా కంప్లీట్ చేయాలనుకుంటున్నట్లు టాక్ నడుస్తోంది. ఇంతకీ, ప్రశాంత్ నీల్ నుంచి రాబోతున్న తదుపరి సినిమా ఏమిటి అనే దాని పై మరో కొన్ని రోజుల్లో క్లారిటీ రానుంది. ఏది ఏమైనా సలార్ పార్ట్-2 పై మొత్తానికి భారీ అంచనాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు