“స్కంద” ఓటీటీ రిలీజ్ పోస్ట్ పోన్.?

“స్కంద” ఓటీటీ రిలీజ్ పోస్ట్ పోన్.?

Published on Oct 27, 2023 7:03 AM IST

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా యంగ్ హీరోయిన్స్ శ్రీలీల మరియు సాయి మంజ్రేకర్ లు హీరోయిన్స్ గా మన టాలీవుడ్ మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన మాసివ్ యాక్షన్ డ్రామా చిత్రమే “స్కంద”. మరి మాస్ ని బాగానే అలరించిన ఈ చిత్రం రామ్ కెరీర్ లో బెస్ట్ ఓపెనింగ్స్ ని అందుకుంది. ఇక ఈ చిత్రం థియేట్రికల్ రిలీజ్ అనంతరం అంతా ఓటీటీ రిలీజ్ కోసం అయితే చూసారు.

మరి ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు డిస్నీ + హాట్ స్టార్ వారు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే అందులో ఈ చిత్రం ఇప్పటికే స్ట్రీమింగ్ కి రావాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఈ చిత్రం నవంబర్ లోకి షిఫ్ట్ అయ్యినట్టుగా తెలుస్తోంది. బహుశా దీపావళి కానుకగా వస్తుందని లేటెస్ట్ టాక్. మరి దీనిపై అసలు క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు