ఎస్పీ బాలు గారి ఆరోగ్యంపై తాజా అప్డేట్.!

ఎస్పీ బాలు గారి ఆరోగ్యంపై తాజా అప్డేట్.!

Published on Aug 18, 2020 12:05 PM IST

balasubrahmanyam

మన ఇండియన్ లెజెండరీ సింగర్ ఎస్పి బాలసుబ్రమణ్యం గారి ఆరోగ్యం విషయంలో గత కొన్ని రోజుల నుంచి కాస్త ఆందోళనకర పరిస్థితులు నెలకొన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ తర్వాత తర్వాత మెల్లగా ఆయన కరోనా నుంచి కోలుకుంటున్నారని ఆయన కుటుంబ సభ్యులు ఎప్పటికప్పుడు సమాచారాన్ని వెల్లడి చేస్తుండటంతో ఆయన అభిమానులకు సమాచారం తెలుస్తుంది.

ఇదిలా ఉండగా ఇప్పుడు ఆయన సోదరి ఎస్పీ శైలజ ఆయన ఆరోగ్యం విషయంలో ఒక తాజా వివరాలను వెల్లడి చేసారు. బాలు గారి ఆరోగ్యం ఇప్పుడు ముందు కంటే మెరుగయ్యింది అని అలాగే ప్రస్తుతం వెంటిలేషన్ తీసేశారని ఆయన ఆరోగ్యం పట్ల వైద్యులు ఆనందంగా ఉన్నారని అలాగే ప్రపంచం అంతా అన్నయ్య కోసం ప్రార్ధనలు చేస్తున్నరని తెలుసు. అందుకు అయినా సరే అన్నయ్య కోలుకొని తిరిగి వస్తారని వారందరికీ ఆమె ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు