పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్టార్ లైనప్ లో భారీ అంచనాలు ఉన్న సినిమా ‘స్పిరిట్’. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఓ పవర్ ఫుల్ కాప్ స్టోరీగా రాబోతుంది. ఐతే, ఈ సినిమా సెకండ్ హాఫ్ లో ఓ స్పెషల్ ఎపిసోడ్ ఉందట. ఈ ఎపిసోడ్ కోసం సందీప్ రెడ్డి వంగా ఓ స్పెషల్ రోల్ ను డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రోల్ కోసం ఓ బాలీవుడ్ స్టార్ హీరోని ఎంపిక చేయాలని సందీప్ రెడ్డి వంగా ప్లాన్ చేస్తున్నాడట. మరి ఈ వార్తలో ఎంత వాస్తవం ఉందో చూడాలి.
కాగా ఈ సినిమాలో త్రుప్తి దిమ్రిని హీరోయిన్గా నటిస్తోంది. ప్రభాస్ లుక్ కూడా పక్కా వైల్డ్ అండ్ మాస్ అవతార్ లో లో ఉంది. కాగా మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ తో సందీప్ రెడ్డితో మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా పూర్తి చేశాడు. ఈ చిత్రాన్ని టి-సిరీస్ మరియు భద్రకాళి పిక్చర్స్ భారీ స్థాయిలో నిర్మించనున్నాయి. అన్నట్టు ‘స్పిరిట్’ మెయిన్ కథాంశమే చాలా కొత్తగా ఉంటుందని.. సందీప్ రెడ్డి వంగా నుంచి మరో వినూత్న సినిమా రాబోతుంది.


