కోలీవుడ్ స్టార్ హీరో సూర్య అలాగే దిశా పటాని హీరో హీరోయిన్స్ గా దర్శకుడు శివ కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “కంగువ” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రంని భారీ హంగులతో తెరకెక్కిస్తుండగా ఈ సినిమా రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఎప్పుడు నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే రీసెంట్ గానే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం నుంచి సూర్య సెకండ్ లుక్ ని కూడా మేకర్స్ రిలీజ్ చేశారు.
ఇవన్నీ చూస్తుంటే సినిమా రిలీజ్ త్వరలోనే ఉంటుంది అని చాలా మంది ఆశిస్తున్నారు. కానీ ఈ సినిమా రిలీజ్ కావడానికి అయితే మేకర్స్ ఏమాత్రం కంగారు తీసుకోవట్లేదట. సినిమాకి చాలా గ్రాఫికల్ వర్క్ పెండింగ్ ఉందని అందుకే సినిమాని ఎలాంటి కంగారు లేకుండా అన్ని పనులు కంప్లీట్ చేసి రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. దీనితో కాస్త ఎర్లీ రిలీజ్ ఉంటుంది అనుకునేవారు మాత్రం ఇంకాస్త సమయం ఆగాల్సి ఉంటుంది అని చెప్పాలి.


