యష్ భారీ చిత్రం “టాక్సిక్” పై లేటెస్ట్ అప్డేట్.!

యష్ భారీ చిత్రం “టాక్సిక్” పై లేటెస్ట్ అప్డేట్.!

Published on Apr 2, 2024 9:00 PM IST

కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా తన కెరీర్ 19వ సినిమా ఎప్పుడెప్పుడు అనౌన్స్ చేస్తాడా అనే సమయంలో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తో అనౌన్స్ చేసిన భారీ చిత్రమే “టాక్సిక్” (Yash Toxic Movie). క్రేజీ మోషన్ పోస్టర్ టీజర్ తో మేకర్స్ చేసిన అనౌన్సమెంట్ పాన్ ఇండియా ఆడియెన్స్ లో యష్ నుంచి సెన్సేషనల్ ఫ్రాంచైజ్ “కేజీయఫ్” తర్వాత ఉన్న హైప్ ని అందుకుంది.

దీనితో ఈ సినిమా మరింత ప్రత్యేకంగా మారగా ఈ చిత్రం ఇప్పుడు ఫైనల్ గా ఈ చిత్రం ఎప్పుడు మొదలవుతుంది అనేది దాదాపు ఖరారు అయ్యింది. మేకర్స్ ఈ చిత్రాన్ని ఈ ఏప్రిల్ 10 నుంచి షూటింగ్ స్టార్ట్ చేయనున్నారట.

కర్ణాటక బెంగళూరు లోనే సినిమా దాదాపు చిత్రీకరణ పూర్తి చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. సో ఎట్టకేలకి ఈ అవైటెడ్ సినిమా అప్పుడు నుంచి మొదలు కానుంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రాన్ని నిర్మాణ సంస్థ కే వి ఎన్ ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహిస్తుండగా పాన్ ఇండియా భాషల్లోనే సన్నాహాలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు