లేటెస్ట్ వీడియో : ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్ కి డ్యాన్స్ అదరగొట్టిన రమేష్ బాబు కూతురు

లేటెస్ట్ వీడియో : ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్ కి డ్యాన్స్ అదరగొట్టిన రమేష్ బాబు కూతురు

Published on Feb 19, 2024 12:21 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ గుంటూరు కారం ఇటీవల ఆడియన్స్ ముందుకి వచ్చి మంచి విజయం అందుకుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ మూవీలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించగా థమన్ సంగీతం అందించారు. ఇక ఈ మూవీలోని కుర్చీ మడతపెట్టి సాంగ్ కి అందరి నుండి విశేషమైన రెస్పాన్స్ లభిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సాంగ్ లిరికల్ వీడియో 100 మిలియన్ పైగా వ్యూస్ తో కొనసాగుతోంది.

మరోవైపు పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఈ సాంగ్ కి పలువురు ఆడియన్స్, ఫ్యాన్స్ రీల్స్, షార్ట్స్ కూడా చేస్తున్నారు. విషయం ఏమిటంటే, తాజాగా ఈ సాంగ్ కి మహేష్ బాబు సోదరుడు దివంగత నటుడు, నిర్మాత అయిన రమేష్ బాబు కూతురు భారతి ఘట్టమనేని డ్యాన్స్ ఇరగదీసారు. తాజాగా కుర్చీ మడతపెట్టి సాంగ్ కి తన స్టైల్ లో డ్యాన్స్ అదరగొట్టిన వీడియోని తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసారు భారతి. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు