మెగా ఇంటి కోడలు లావణ్య కొణిదెల త్రిపాఠి, దేవ్ మోహన్ ప్రధాన పాత్రధారులుగా దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్‌పై తాతినేని సత్య దర్శకత్వంలో రూపొందుతోన్న లేటెస్ట్ సినిమానే ‘సతీ లీలావతి’. భీమిలీ కబడ్డీ జట్టు, ఎస్.ఎం.ఎస్(శివ మనసులో శృతి) ఫేమ్ తాతినేని సత్య దర్శకత్వం వహించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్, సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని మే 8న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ కి తీసుకొస్తున్నట్టు మేకర్స్ లేటెస్ట్ అప్డేట్ అందించారు.
రెండు వేర్వేరు కుటుంబాలు, నేపథ్యాల నుంచి వచ్చిన వ్యక్తులు కలిసి ప్రయాణించాలంటే వారి మధ్య ఎమోషన్స్ ఇంకెంత బలంగా ఉండాలో అనే సునిశితమైన అంశాన్ని సతీ లీలావతి చిత్రంలో ఆవిష్కరించారు దర్శకుడు తాతినేని సత్య. భార్య, భర్త మధ్య ఉండే అనుబంధాన్ని ఎమోషనల్‌గానే కాకుండా ఎంటర్‌టైనింగ్‌గానూ చెప్పే ప్రయత్నమే సతీలీలావతి చిత్రం.
ఫీల్ గుడ్ మూవీగా అందరినీ ఆకట్టుకునేలా, అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించేలా సినిమాను రూపొందించామని మేకర్స్ తెలియజేశారు. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి రెండు సాంగ్స్, టీజర్‌కు ప్రేక్షకుల నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే ట్రైలర్ రిలీజ్ కానుంది. ఈ మూవీకి సంగీత దర్శకుడిగా మిక్కీ జే మేయర్, కెమెరామెన్‌గా బినేంద్ర మీనన్, ఎడిటర్‌గా సతీష్ సూర్య వర్క్ అందించారు.


