నిఖిల్ సినిమాలో హీరోయిన్ కన్ఫర్మ్ !
Published on May 18, 2018 3:00 pm IST


ఇటీవలే ‘కిరాక్ పార్టీ’తో మనల్ని పలకరించిన యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం టిఎన్.సంతోష్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం టిఎన్.సంతోష్ డైరెక్ట్ చేసిన తమిళ ‘కనిథన్’ కు తెలుగు రీమేక్ గా రూపొందుతోంది. ఈ చిత్రంలో మొదటగా షాలిని పాండేను కథానాయకిగా అనుకున్నా ఆ తర్వాత ఆమె స్థానంలో లావణ్య త్రిపాఠిని తీసుకున్నట్లు వార్తలొచ్చాయి.

అయితే ఇన్ని రోజులు ఈ వార్త నిజమా కాదా ఆమె సందేహం నడుస్తున్న నైపథ్యంలో లావణ్య త్రిపాఠిని తీసుకున్న మాట నిజమేనని తేలిపోయింది. ఇక ఈ చిత్రానికి ‘విక్రమ్ వేద, కణం’ చిత్రాలకు సంగీతాన్ని అందించిన సంగీత దర్శకుడు శామ్.సిఎస్ స్వరాలు అందివ్వనున్నారు. ఇప్పటికే కొంత షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాను కావియా వేణుగోపాల్, రాజ్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook